చర్మం మెరుపు కోసం ఫేషియల్ చేయించుకుంటున్నారా..?

చర్మం మెరుపు కోసం ఫేషియల్ చేయించుకుంటున్నారా..?

ఫేషియల్ వల్ల చర్మం మెరుస్తుంది. కానీ.. రెగ్యులర్​గా ఫేషియల్ చేయించుకుంటే చాలా సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయి. అందుకే అవేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

  • ఫేషియల్స్​లో వాడే  సొల్యూషన్స్, క్రీమ్స్​లో  కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అవి చర్మ కణాలను డ్యామేజ్ చేస్తాయి. వాటివల్ల చర్మం దురద పెడుతుంది. 
  • ఫేషియల్స్ చేసేటప్పుడు స్క్రబ్ చేయడం వల్ల మాయిశ్చరైజర్  పోతుంది. ఫలితంగా చర్మం పైపొర డ్యామేజ్​ అయి మచ్చలు పడతాయి. 
  • యాక్నె ఫేషియల్ తర్వాత చాలామందికి పింపుల్స్​ సమస్య పెరుగుతుంది. ఎందుకంటే ఫేషియల్స్ తర్వాత చర్మ గ్రంధులు తెరుచుకొని  సీబమ్  ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దాంతో మొటిమలు వస్తాయి. 
  • అలాగే బ్లాక్​ హెడ్స్ తొలగించేటప్పుడు బ్యూటీషియన్స్ చేతి వేళ్లు లేదా ఎక్విప్​మెంట్​ వాడతారు. ఇలా చేసేటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. చర్మంపై గీతలు పడతాయి​. అందుకని ఫేషియల్ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరంటే వాళ్ల దగ్గర కాకుండా..ఎక్స్​పర్ట్స్​ దగ్గర మాత్రమే ఫేషియల్స్​ చేయించుకోవాలి.