ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చేయాలంటే.?

ఇంటర్ తర్వాత ఏ  కోర్సులు చేయాలంటే.?

ఇంటర్ తర్వాత ఏ కోర్సు చేయాలి..ఏ కోర్సు చేస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చనే  సందేహాలు చాలామంది విద్యార్థుల్లో ఉంటాయి. ఇంటర్మీడియట్  తర్వాత ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నా..ఎక్కువ మంది విద్యార్థులు ఐటీని కెరీర్ గా ఎంచుకోవడానికి ఆసక్తి కనభరుస్తుంటారు.  అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలను కోరుకునే విద్యార్థులు దేశంలో అందుబాటులో ఉన్న వివిధ టాప్ ఐటి కోర్సులు చేయాలని అనుకుంటారు. ఐటీ రంగంలో ఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి...ఏ కోర్సులు చేస్తే అధిక వేతనాన్ని పొందొచ్చో  ఆ వివరాలు మీకోసం..

బిజినెస్ ఇంటెలిజెన్స్

నేటి సాంకేతికత-ఆధారిత ఆర్థిక వ్యవస్థలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో బిజినెస్ ఇంటెలిజెన్స్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. వర్క్‌ప్లేస్‌లలో విశ్లేషణ, డేటా మోడలింగ్‌ను నిర్వహించగల అర్హత కలిగిన ఉద్యోగులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. BIలో IT కోర్సు ద్వారా డేటా ప్లానింగ్, మెటాడేటా సిస్టమ్స్ డెవలప్‌మెంట్, ERP, సిస్టమ్స్ అనాలిసిస్, ప్రోగ్రామింగ్, టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవచ్చు. 

బిగ్ డేటా, డేటా సైన్స్

బిగ్ డేటా, డేటా సైన్స్ సర్టిఫికేట్ కోర్సులు డేటా సైన్స్ యొక్క పనితీరు, మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ అప్లికేషన్‌లు, డేటా విజువలైజేషన్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వాడకంతో సహా ఇతర రంగాలలో అభ్యర్థులకు పరిజ్ఞానాన్ని అందిస్తాయి. బిగ్ డేటా, డేటా సైన్స్ కోర్సులు నేర్చుకున్న న్న అభ్యర్థులు డేటా సైంటిస్ట్, ML ఇంజనీర్, డేటా అనలిస్ట్, ప్రొడక్ట్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజనీర్ ఉద్యోగాలు భారీ వేతనాలతో పొందొచ్చు. 

ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్

ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులు విద్యార్థులకు బిజినెస్ గ్రోత్ కు ఉపయోగపడతాయి.  స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, లీడర్‌షిప్, స్ట్రక్చర్డ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్ పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాటజిక్ థింకింగ్ వంటి ప్రాజెక్టు మేనేజ్ మెంట్ కోర్సులు బోధిస్తాయి. ఈ కోర్సు ద్వారా ఐటీ పరిశ్రమలో అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజర్, సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్, సర్టిఫైడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తదితర పోస్టులను సాధించొచ్చు.  

వెబ్ డెవలప్ మెంట్

వెబ్ డెవలప్‌మెంట్ లేదా వెబ్ డిజైనర్ కోర్సులకు HTML, CSS, JS పరిజ్ఞానం అవసరం. ఈ సర్టిఫికేట్ కోర్సుల్లో డైనమిక్ వెబ్ పేజీలు తయారు చేయడం, వాటి నిర్వహించడం నేర్పుతారు. ఈ కోర్సుల సహాయంతో విద్యార్థులు వెబ్‌సైట్‌లు, బ్యాక్-ఎండ్ APIలు, రిచ్, ఇంటరాక్టివ్ వెబ్ UIలను రూపొందించడం నేర్చుకుంటారు. వెబ్ డెవలప్‌మెంట్ లేదా డిజైనర్ కోర్సులు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. అడోబ్, గూగుల్, జెండ్, మైక్రోసాఫ్ట్ వంటి అత్యంత ప్రసిద్ధ కంపెనీలు వెబ్ డెవలప్ మెంట్ కోర్సులను నేర్పుతాయి. 

సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ 

ప్రస్తుత కాలంలో  ప్రతి రంగంలో సాఫ్ట్‌వేర్ అవసరం తప్పనిసరి అయింది. పైథాన్, జావా, C#, R, SAS, Scala, Swift, JavaScript, టైప్‌స్క్రిప్ట్‌లు అధిక డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ భాషలు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో వృత్తిని కొనసాగించాలనుకునే వారు.. ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే. అనేక ప్రోగ్రామింగ్ భాషల్లోని ప్రొఫెషనల్ సర్టిఫికేషన్‌లు సమర్థవంతమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా  మొబైల్, ఆన్‌లైన్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి సాఫ్ట్ వేర్ కోర్సులు అభ్యర్థులకు సహాయపడతాయి.