
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్నికల్చర్(ఐసీఏఆర్ సీఐడబ్ల్యూఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్, ఫీల్డ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 04.
పోస్టుల సంఖ్య: 52. యంగ్ ప్రొఫెషనల్స్ 26, ఫీల్డ్ అసిస్టెంట్ 26.
ఎలిజిబిలిటీ: యంగ్ ప్రొఫెషనల్స్‌కు అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ, హోమ్ సైన్స్ లేదా కమ్యూనిటీ సైన్సులో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా లేదా అగ్రికల్చర్ సబ్జెక్టులో రెండేండ్ల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 45 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పని అనుభవం ఉండాలి.
లాస్ట్ డేట్: జులై 04.
సెలెక్షన్ ప్రాసెస్: ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి (10 మార్కులు), 12వ తరగతి (10 మార్కులు), గ్రాడ్యుయేషన్ కు (10 మార్కులు) మొత్తం 30 మార్కులు ఎడ్యుకేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. రీసెర్చ్ లేదా పని అనుభవానికి20 మార్కులు ఇస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం 100 మార్కులతో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.