రైల్లో లాంగ్​ జర్నీ చేయాల్సివస్తే..

రైల్లో లాంగ్​ జర్నీ చేయాల్సివస్తే..

రైల్లో లాంగ్​ జర్నీ చేయాల్సివస్తే.. ఇంటి నుంచి క్యారేజ్​ తెచ్చుకుంటారు చాలామంది. బాక్స్ లేకుంటే ఇంతకుముందు ఐఆర్​సిటీసి వెబ్​సైట్​లో ఆర్డర్​ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు వాట్సాప్​లో ఆర్డర్​ పెడితే చాలు కూర్చున్న దగ్గరికే క్వాలిటీ ఫుడ్ తెచ్చిస్తారు. ప్యాసింజర్లకు క్వాలిటీ ఫుడ్​ని తక్కువ టైంలోనే అందించాలని ఐఆర్​సిటీసి ఫుడ్ డెలివరీ యాప్​ జూప్​,  జియోహాప్​టిక్​తో చేతులు కలిపింది. జర్నీ చేస్తూనే జూప్​ వాట్సాప్​ చాట్​బోట్​ నెంబర్​ 7042062070కి కావాల్సిన ఫుడ్​తో పాటు. పది అంకెల పిఎన్​ఆర్​ (ప్యాసింజర్​ నేమ్ రికార్డ్) నెంబర్ పంపించాలి. దాంతో ఫుడ్​ని సీటు దగ్గరికే తెచ్చిస్తారు ఐఆర్​సిటీసి స్టాఫ్​. అంతేకాదు రియల్ టైమ్ మీల్​ ట్రాకింగ్ సర్వీస్​ సాయంతో ఫుడ్​ పార్శిల్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు కూడా. 

ట్విట్టర్​లో​ పాడ్​కాస్ట్ 

ఈమధ్యే ఆడియో చాట్​ రూమ్​, స్పేస్ ట్యాబ్ ఫీచర్ తెచ్చింది ట్విట్టర్. ఇప్పుడు టెస్ట్​ వెర్షన్​గా పాడ్​కాస్ట్​ల​ని తీసుకొస్తోంది. దీంతో యూజర్లకు ‘స్టేషన్స్​’ పేరుతో పర్సనల్​ హబ్స్​ని అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్​ అయిన పాడ్​కాస్ట్​లు ఇందులో ఉంటాయి. వీటిలో న్యూస్, మ్యూజిక్, స్పోర్ట్స్​తో పాటు అనేక అంశాలు ఉంటాయి. పాడ్​కాస్ట్​లో ఏం వినాలనేది థీమ్స్​, ఫాలో అయ్యేవాళ్లను బట్టి కనిపిస్తుంది. దాంతో వాటిలో  నచ్చిన షోస్​ వినొచ్చు. పాడ్​కాస్ట్​ కింద  థంబ్స్​ అప్​ లేదా థంబ్స్​ డౌన్​ సింబల్ ​ పోస్ట్​ చేయాలి. దాంతో అందులోని  కంటెంట్​ ఆసక్తిగా ఉందా? లేదా? అనే విషయం ట్విట్టర్​కి తెలుస్తుంది.  

ఇంటర్నెట్ లేకున్నా... 

ఇకనుంచి ఇంటర్నెట్ లేకున్నా ఐ ఫోన్ యూజర్లు వాయిస్​ అసిస్టెంట్ ‘సిరి’ ని వాడొచ్చు. అందుకోసం... ఐఫోన్ లేదా ఐపాడ్ సెట్టింగ్స్​లో ‘సిరి’ ఆప్షన్​ని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్​లో ఇంగ్లీష్​ సెలక్ట్ చేయాలి. తర్వాత వెనక్కి వెళ్లి 'హే సిరి’ పక్కన ఉన్న టాగిల్ బార్​ని కుడిపైపు జరపాలి.  సిరి రెస్పాన్సివ్​ మీద క్లిక్ చేసి, టాగిల్ బార్​ని వెనకాల పెట్టాలి. అంతేకాదు సిరి క్యాప్లన్స్, స్పీచ్​ ఎప్పుడూ ఆన్​లో ఉండేలా చేయాలి. ఈ సెట్టింగ్స్ చేస్తే ఇంటర్నెట్​ లేనప్పుడు కూడా ‘సిరి’ పనిచేస్తుంది. అయితే ఐఒఎస్ 15  ఉన్న ఫోన్లు, ట్యాబ్స్​లోనే ఈ ఫీచర్ పనిచేస్తుంది.

వాట్సాప్​లో అన్​డు

ఒక్కోసారి ముఖ్యమైన మెసేజ్​లని పొరపాటున డిలిట్ చేస్తుంటాం. దాంతో వాటిని మళ్లీ చూడడం కుదరదు. కొన్నిసార్లు గ్రూప్​లోని మెసేజ్​లని ‘డిలిట్ ఫర్​ మి’ బదులు ‘డిలిట్​ ఫర్​ ఆల్​’ ఆప్షన్​ ఎంచుకుంటాం. దాంతో మెసేజ్​ పోతుంది. ఇకపై అలాంటి సమస్య లేకుండా మెసేజ్​ డిలిట్ అన్​డు ఫీచర్ తెస్తోంది వాట్సాప్. అంటే డిలిట్ చేసిన మెసేజ్​ని రికవరీ చేయొచ్చు. ఐఒఎస్ బీటా అప్​డేట్ ఉన్న వాట్సాప్​లో ఈ ఫీచర్​ పనిచేస్తుంది.