సాంప్రదాయ విద్యావ్యవస్థలో ఏళ్ల తరబడి లెక్చర్లు, కుప్పలు తెప్పలుగా హోంవర్క్‌లు సర్వసాధారణం. కానీ, అమెరికాలోని టెక్సాస్ వేదికగా ప్రారంభమైన AI స్కూల్ ఆ పద్ధతులన్నింటినీ తిరగరాస్తోంది. ఇక్కడ పాఠాలు చెప్పడానికి మనుషులు ఉండరు. కృత్రిమ మేధ (AI) సాఫ్ట్‌వేర్‌లే ట్యూటర్లుగా విద్యార్థి నేర్చుకునే వేగాన్ని బట్టి ఇవి పాఠాలను బోధిస్తాయి.ప్రతిరోజూ ఉదయం కేవలం రెండు గంటలు మాత్రమే చదువుకు కేటాయిస్తారు. మిగిలిన రోజంతా విద్యార్థులు సొంతంగా వ్యాపారాలు నిర్మించడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి రియల్ వరల్డ్ పనుల్లో నిమగ్నమవుతారు.బహుశా ప్రపంచంలో ఏ స్కూల్ ఇవ్వని హామీని ఇది ఇస్తోంది. విద్యార్థి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే నాటికి 1 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 9 కోట్లు సంపాదించే స్థాయికి చేరుకోవాలి.ఒకవేళ విద్యార్థి ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే, వారు చెల్లించిన ట్యూషన్ ఫీజును ప్రతి రూపాయి తిరిగి ఇచ్చేస్తుంది స్కూల్ యాజమాన్యం. అదే అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న AI ఆల్ఫా స్కూల్ (ఆల్ఫా హై స్కూల్).
ఏఐ ఆల్ఫా స్కూల్ ..
అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న AI ఆల్ఫా స్కూల్ (ఆల్ఫా హై స్కూల్) విద్యా వ్యవస్థలో సంచలనంగా మారింది. రోటీన్ టీచింగ్ మెథడ్స్ ను సవాలు చేస్తూ కృత్రిమ మేధ (AI) సాయంతో విద్యార్థులను భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతుంది ఈ స్కూల్.దీనిని ఆల్ఫా హై స్కూల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ విద్యార్థులకు ఫుల్ భరోసా.. పట్టభద్రులయ్యే నాటికి వారు 1 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 9 కోట్లు సంపాదిస్తారు. ఒకవేళ వారు అలా చేయలేకపోతే, పాఠశాల వారి ఫీజులోని 62 లక్షల వరకు స్కూల్ యాజమాన్యం తిరిగి ఇచ్చేస్తుంది. AI ఆల్ఫా స్కూల్ 2014లో ఒక విప్లవాత్మక ఆలోచనతో ప్రారంభించారు.
ఈ పాఠశాలలో AI, వాస్తవ ప్రపంచ అనుభవాల ద్వారా విద్యా విధానాన్ని పూర్తిగా మార్చి వేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసుల్లో పాఠాలు వినడం, హోమ్‌వర్క్‌లు చేయడంతో సమయాన్ని గడపడానికి బదులుగా, ఇక్కడి విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం కేవలం రెండు గంటలు మాత్రమే చదువుకు కేటాయిస్తారు.మిగిలిన రోజంతా వారు సొంతంగా వ్యాపారాలను నిర్మించడం, తమకు ఆసక్తి ఉన్న రంగాలను అన్వేషించడం ,నిజ జీవితంలో అత్యంత అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో టైం స్పెండ్ చేస్తారు.
విద్యార్థులు తమ వేగానికి అనుగుణంగా పాఠాలను నేర్చుకోవడానికి AI సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తారు.కేవలం పుస్తక జ్ఞానం కాకుండా, వ్యాపార నిర్వహణ ,సమస్య పరిష్కార నైపుణ్యాలకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు.తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను నేర్చుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు.
AI ఆల్ఫా స్కూల్..అమెరికా అంతటా 20 కంటే ఎక్కువ ప్రాంతాల్లో కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ K-12 పాఠశాలల నెట్‌వర్క్. దీనికి టెక్సాస్, శాన్ ఫ్రాన్సిస్కో, మయామి, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డిసి, డల్లాస్ వంటి ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఇక్కడి ట్యూషన్ ఫీజు 10వేలడాలర్ల నుంచి 75వేల డాలర్ల అంటే సుమారు రూ. 8.3 లక్షల నుంచి రూ. 62 లక్షల వరకు ఉంటుంది. ఇక్కడి రెండు గంటల లెర్నింగ్ మోడల్ లో టీచర్లు ఉండరు. కేవలం విద్యార్థులను ప్రోత్సహించే ,వారికి సపోర్టునిచ్చే AI గైడ్స్ మాత్రమే ఉంటారు. విద్యార్థులు తమ చదువును ఉదయం పూట పూర్తి చేస్తారు. మిగిలిన రోజంతా ఆదాయాన్ని ఇచ్చే ప్రాజెక్టులను నిర్మించడానికే కేటాయిస్తారు.
ఈ ఖచ్చితమైన విద్యావిధానం ,వాస్తవ ప్రపంచ అనుభవం కలిసి.. AI ఆల్ఫా స్కూల్ ఒక అసాధారణమైన గ్యారెంటీని ఇస్తుంది. అదేమిటంటే, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయానికి విద్యార్థి 1 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 8.3 కోట్లు సంపాదించాలి. లేదంటే వారు చెల్లించిన 40వేల డాలర్లు సుమారు రూ. 37 లక్షలు ట్యూషన్ ఫీజును పాఠశాల పూర్తిగా వెనక్కి ఇచ్చేస్తుంది. ఇలాంటి స్కూల్స్ మనకూ ఉంటే బాగుంటుంది కదా.
