పడుకునే ముందు మెత్త కింద ఫోన్ పెట్టుకుంటే..

పడుకునే ముందు మెత్త కింద ఫోన్ పెట్టుకుంటే..

చాలామందికి ఫోన్ ఒక వ్యసనంలా మారిపోయింది. పడుకునే ముందు ఫోన్ పక్కనే ఉండాలి. నిద్రలేవగానే మళ్లీ ఫోన్ చేతబట్టాలి. పడుకునే ముందు చాలామందికి ఫోన్‌ను మెత్త కింద పెట్టుకొని పడుకునే అలవాటుంటుంది. అలా మెత్త కింద పెట్టిన ఫోన్‌కు మంటలంటుకోవడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో జరిగింది.

కొల్లాం జిల్లాలోని ఓచిరాకు చెందిన 53 ఏళ్ల చంద్ర బాబు ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన సోమవారం త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడిని దించి వచ్చాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత చంద్రబాబు భోజనం చేసి కాసేపు పడుకుందామనుకున్నాడు. అలా పడుకునే టైంలో తన ఫోన్‌ను మెత్త కింద పెట్టుకొని పడుకున్నాడు. ఆయన నోకియా కంపెనీకు చెందిన కీప్యాడ్ ఫోన్‌ను వాడుతున్నాడు. అయితే కాసేపటి తర్వాత మెత్త నుంచి మంటలు రావడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు.. వెంటనే లేచి చూశాడు. అప్పటికే మెత్త సగం కాలిపోయింది. ఫోన్ నుంచి మంటలు వస్తున్నాయి. మంటల వల్ల చంద్రబాబు ఎడమ చేతి, భుజానికి గాయాలయ్యాయి. వెంటనే ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ఆ ఘటన జరిగిన సమయంలో ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టలేదని, మంటలు ఎలా వచ్చాయో తెలియదని ఆయన అన్నారు. ‘నేను పడుకునే ముందు ఫోన్ మెత్త కింద పెట్టుకున్నాను. సడెన్‌గా మంటలు వచ్చాయి. ఎడమ చేతికి, భుజానికి గాయాలయ్యాయి. మంటలు ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. ఆ టైంలో ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టలేదు. ఏదేమైనా ఇప్పటినుంచి ఎవరూ కూడా ఫోన్‌ను మెత్త కింద పెట్టుకొని పడుకోకండి. అది అంత సురక్షితం కాదు’ అని చంద్రబాబు కోరుతున్నాడు.

For More News..

తనని తానే కిడ్నాప్ చేసుకొని రూ. 50 కోట్లు డిమాండ్ చేసిన 15 ఏళ్ల బాలుడు

రాష్టంలో మరో 1,637 కరోనా కేసులు

యూట్యూబ్‌ లో కొత్త ఫీచర్‌