వాగు దాటాలంటే..ఈ ఫీట్లు చేయాల్సిందే  

వాగు దాటాలంటే..ఈ ఫీట్లు చేయాల్సిందే  

ఖమ్మం: గుండాల మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరోసారి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మల్లన్న, ఏడుమెళికల, కిన్నెరసాని వాగులు పొంగిపోర్లుతున్నాయి. రోళ్లగడ్డ, దేవళ్లగూడెం, నర్సాపురం, కన్నయిగూడెం, రోళ్లగడ్డ తండాకు చెందిన ప్రజలు గుండాలకు రావాలంటే నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో పైపులపై ఇలా ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు. ముత్తపురం పంచాయతీలోని మోదుగులగూడెం నుంచి వలసళ్ల, దొంగతోగు, నడింగూడెం వెళ్లే ప్రజలు కట్టెలతో వాగు దాటుతున్నారు.