V6 News

రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిస్తే ప్రమాదాలను నివారించొచ్చు : ఐజీపీ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయుడు 

రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిస్తే ప్రమాదాలను నివారించొచ్చు : ఐజీపీ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయుడు 
  • రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయుడు 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: వాహనదారులు రోడ్డు భద్రత రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన-– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సిరిసిల్లలో జిల్లా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడేది వాహనాల డ్రైవర్లేనని తెలిపారు.

‘రహావీర్’ స్కీం కింద ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను సమీప ప్రధాన రహదారుల వెంబడి ఉన్న హాస్పిటళ్లకు తరలిస్తే, వారంపాటు ఉచిత చికిత్స అందిస్తూ.. రూ.1.50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. అనంతరం డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు.  కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ కుమార్ బి.గీతే, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఆర్టీవో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.