బీటెక్ CSE పూర్తి చేశారా..? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే..!

బీటెక్ CSE పూర్తి చేశారా..? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే..!

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టులు భర్తీకి ఇండియన్ హైవ్సే మేనేజ్​మెంట్ కంపెనీ(ఐహెచ్ఎంసీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐహెచ్ఎంసీఎల్ అధికారిక వెబ్​సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేదీ జూన్ 06. 

పోస్టులు 49: ఇంజినీర్ (ఐటీఎస్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచుల నుంచి సమాన అర్హత కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. 
వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 21 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 02.
లాస్ట్ డేట్: జూన్ 02.
సెలెక్షన్ ప్రాసెస్: 2025 గేట్ స్కోర్ ఆధారంగా  షార్ట్​లిస్ట్  చేస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.