హైదరాబాద్, వెలుగు: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రూ.రెండు వేల కోట్లు సమీకరించేందుకు మంగళవారం నుంచి పబ్లిక్ బాండ్ల జారీని ప్రారంభించనుంది.
వీటితో ఏడాదికి 9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. పెట్టుబడిదారులు 24, 36, 60 నెలల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. వీటిని బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ చేస్తారు. కనీస పెట్టుబడి రూ.10 వేలుగా నిర్ణయించారు.
2026 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ లో కంపెనీ రూ.501.3 కోట్లు నికరలాభం సాధించింది. సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు వాడతారు.
