కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఐఐటీ హైదరాబాద్‎లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇవే

కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఐఐటీ హైదరాబాద్‎లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇవే

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) మల్టీ మీడియా కంటెంట్ క్రియేటర్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. 

  • పోస్టులు: మల్టీమీడియా కంటెంట్ క్రియేటర్.
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో మల్టీ మీడియా ప్రొడక్షన్, ఫిల్మ్ స్టడీస్, విజువల్ ఆర్ట్స్​లో  గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్​వేర్, గ్రాఫిక్ డిజైన్ టూల్స్ ప్రావీణ్యం ఉండాలి. ఏడాది పని అనుభవం ఉండాలి.  
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
  • అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 17
  • లాస్ట్ డేట్: నవంబర్ 7. 
  • సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, స్క్రీనింగ్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు www.iith.ac.inవెబ్​సైట్​లో సంప్రదించగలరు.