ముగ్గురి ఐఐటీ స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్.. రోజుకు లక్ష శాలరీతో జాబ్ ఆఫర్స్

ముగ్గురి ఐఐటీ స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్.. రోజుకు లక్ష శాలరీతో జాబ్ ఆఫర్స్

భారీ శాలరీల ప్యాకేజీలతో ఐఐటీ విద్యార్థులు దుమ్ము లేపుతున్నారు.  ఏటా తమ రికార్డులను తామే తిరగరాస్తున్నారు. తాజాగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్ కు చెందిన ముగ్గురు స్టూడెంట్స్ కు ఏకంగా రూ.4 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీని ఓ కంపెనీ ఆఫర్ చేసింది.అమెరికాకు చెందిన ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ క్యాపిటల్ (Jane Street Capital)  ఈ ముగ్గురు ఐఐటీ స్టూడెంట్స్ కు ప్రీ ప్లేస్మెంట్ఆఫర్స్ఇచ్చింది.  సంవత్సరానికి రూ.4 కోట్ల ప్యాకేజీ అంటే.. ప్రతినెల దాదాపు రూ.30 లక్షలకుపైగా శాలరీని వారు అందుకుంటారు. ఈ లెక్కన ప్రతిరోజు వారు వేతనంగా లక్ష రూపాయలకుపైగా పొందుతారు. 

ఇక ఇటీవల ఐఐటీ రూర్కీకి చెందిన ఓ స్టూడెంట్ కు రూ.1.6 కోట్ల వార్షిక వేతనంతో ఓ కంపెనీ జాబ్ ను ఆఫర్ చేసింది. మరోవైపు  ఐఐటీ కాన్పూర్ కు చెందిన ఫైనలియర్ స్టూడెంట్స్ లో 519 మందికి జాబ్ ఆఫర్స్ వచ్చాయి. వీటిలో 207 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు ఉన్నాయి.  ఐఐటీ కాన్పూర్ స్టూడెంట్ కువచ్చిన అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీ రూ1.9 కోట్లు. రూ.కోటికిపైగా విలువచేసే ప్యాకేజీలకు అందుకున్న ఐఐటీ కాన్పూర్ స్టూడెంట్స్ దాదాపు 33 మంది ఉన్నారు. ఐఐటీ మద్రాస్ కు చెందిన దాదాపు 333 మంది విద్యార్థులకు కూడా తాజాగా ప్లేస్మెంట్ ఆఫర్లు వచ్చాయి. విద్యార్థులకు జాబ్ ఆఫర్స్ ఇచ్చిన కంపెనీల్లో క్వాల్ కామ్, మైక్రో సాఫ్ట్, హనీ వెల్, టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్, గోల్డ్ మన్ శాచ్స్ వంటివి ఉన్నాయి.