వాళ్లంతా షాపింగ్ చేయడానికి ఐకియాకు వెళ్లారు. ఒక్కోటీ చూస్కుంటూ, కావాల్సినవి తీసుకుంటూ ఉండగానే బయట వాతావరణం మారిపోయింది. మంచు తుఫాను ఆ ఏరియాను ముంచెత్తింది. బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో స్టోర్ స్టాఫ్, కస్టమర్లు దాదాపు 30 మందికి పైగా అక్కడే ఉండాల్సి వచ్చింది. దీంతో అప్పటి వరకు తాకి, కూర్చుని చూసిన ఫర్నీచర్పైనే వాళ్లంతా సేదతీరారు. క్యాంటీన్ నుంచి ఫుడ్ తెచ్చుకుని కడుపునిండా తిన్నారు. ఆపై అక్కడున్న బెడ్స్, పరుపులపై నిద్రపోయారు. డెన్మార్క్‌లోని ఐకియా స్టోర్‌లో చోటుచేసుకుందీ ఘటన.
