
- ఆమ్రపాలిని రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ఆమె స్థానంలో ఇలంబర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు
- 16 నెలల్లో ముగ్గురు కమిషనర్ల మార్పు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏపీ కేడర్‌కు చెందిన జీహెచ్ఎంసీ కమిషనర్ఆమ్రపాలిని రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్చేసింది. ఆమె స్థానంలో ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇలంబర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, గ్రేటర్ హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్కు గడిచిన 16 నెలల్లో ముగ్గురు కమిషనర్లు మారారు. గతేడాదిలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా వచ్చిన లోకేశ్కుమార్ను అదే ఏడాది జులై 3న బదిలీ చేశారు. ఆయన స్థానంలో రోనాల్డ్ రాస్‌ను నియమించారు.
ఈ ఏడాది జూన్ 27న రోనాల్డ్ రాస్‌ను బదిలీ చేసి, ఆమ్రపాలికి గ్రేటర్‌సిటీ బాధ్యతలు అప్పగించారు. ఏపీ కేడర్ కు చెందిన ఆమెను తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేయడంతో, ఆమె స్థానంలో ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇలంబర్తికి ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.