
గండిపేట, వెలుగు: మణికొండ మున్సిపాలిటీ పంచవటి కాలనీలో నాలుగు అంతస్తులకు అనుమతులు తీసుకుని అదనంగా వేసిన రెండు అంతస్తులను టౌన్ప్లానింగ్ఆఫీసర్లు కూల్చివేశారు. సోమవారం సిబ్బందితో అక్కడికి చేరుకుని అక్రమ అంతస్తులను తొలగించారు. గతంలో ఈ నిర్మాణానికి నోటీసులు ఇచ్చామని, అయినా పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్‌సింగ్ తెలిపారు.