సీపీఐ నాయకులపై కేసులు ఎత్తేయండి.. డీజీపీకి వినతి

సీపీఐ నాయకులపై  కేసులు ఎత్తేయండి.. డీజీపీకి వినతి
  • డీజీపీకి ఆ పార్టీ లీడర్ల వినతి 

హైదరాబాద్​, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్‌‌‌‌‌‌‌‌ మండలం కుంట్లూరు రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూమిలో పేదలు వేసుకు న్న గుడిసెలకు అండగా నిలిచిన సీపీఐ నేత లపై అక్రమ కేసులు పెట్టారని, వాటిని వెం టనే ఎత్తేయాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం డీజీపీ అంజనీ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆ పార్టీ నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు ప్రైవేట్ భూ కబ్జాదారులతో కుమ్మక్కై పేదల గుడిసెలను తొలగించేందుకు చేసిన ప్రయత్నాన్ని సీపీఐ నేతలు అడ్డుకున్నారని గుర్తుచేశారు. 

దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నేతలు పల్లా వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్యతో పాటు మొత్తం 21 మందిపై హయత్‌‌‌‌‌‌‌‌నగర్ పోలీసులు కేసు లు పెట్టారన్నారు. కుంట్లూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 215 నుంచి 224 వరకు సుమారు వంద ఎకరాల భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న ప్రజలకు వెంటనే పట్టాలివ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చాడ విజ్ఞప్తి చేశారు.