మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారిసంగీత నేతృత్వంలో జ్యోతినగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంతో పాటు, ఆర్కే కాలనీలో అక్రమంగా నిర్మించిన షెడ్లను బుధవారం సీజ్ చేశారు.నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు గతంలోనే నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
