కోకాపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

కోకాపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగాతెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది. తాజాగా  కోకాపేట్ లో అక్రమ నిర్మాణాలను కూలుస్తున్నారు. సర్వే నెంబర్ 147 లో వెలసిన అక్రమ నిర్మాణాలు. ప్రభుత్వ భూమిని కొంతమంది కజ్జా చేసి భవనాలను నిర్మించారు.  జేసీబీల సహాయం తో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నారు.  గండిపేట తహశీల్దారు కబ్జాదారుల ఆట కట్టించే పనిలో ఉన్నారు.