అల్వాల్​: చినరాయుని చెరువు ఎఫ్​టీఎల్​ పరిధిలో అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేత

అల్వాల్​:  చినరాయుని చెరువు ఎఫ్​టీఎల్​ పరిధిలో అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేత

అల్వాల్​ లో హైడ్రా కొరడా ఝళిపించింది.  చిన రాయుని చెరువులో ఎఫ్ టి ఎల్ పరిధిలోని అక్రమ భవన నిర్మాణాలను కూల్చివేసింది. కొంతకాలంగా చెరువుకు ఆనుకుని ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న స్థలంలో అక్రమంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 

అక్రమ భవన నిర్మాణాల విషయంలో స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు ( జూన్​ 5) తెల్లవారుజామునే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని కూల్చివేతలు చేపట్టారు. జేసీబీ ల సహాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు.

భవన నిర్మాణదారులు హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న మూడు  భవన నిర్మాణాలను చేపట్టినవారికి గతంలోనే నోటీసులు  ఇచ్చారు  . స్థానికులు.. యజమానుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు బలగాల మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.