
గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని వట్టి నాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు వ్యక్తులు జీవో 111 నిబంధనలను ఉల్లంఘించి, రాత్రిపూట షెడ్లు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామం 111 జీవో పరిధిలో ఉండగా, ఇక్కడ ఎలాంటి బహుళ అంతస్తులు, షెడ్లు నిర్మించుకోవడానికి పర్మిషనల్ లేదు. అయినప్పటికీ కొందరు రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు చేసి, బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన నార్సింగి మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఇటూవైపు కన్నెత్తి చూడడం లేదు.