ముంబై – అహ్మదాబాద్ జాతీయ రహదారిపై గుర్రపు పందెం

ముంబై – అహ్మదాబాద్ జాతీయ రహదారిపై గుర్రపు పందెం

ముంబై- అహ్మదాబాద్ హైవేపై  అక్రమంగా గుర్రపు బండ్ల రేస్ జరిగింది.  గుర్రపు బండ్లు పరుగులు పెడుతుంటే.. వాటిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. గుర్రాలను బైక్ లపై ఫాలో అయిన యూత్ బీరు తాగుతూ సీసాలను రోడ్లపై విసిరేశారు.  

ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబయి-అహ్మదాబాద్ హైవేపై ఆదివారం(జూన్18 గందరగోళ వాతావరణం నెలకొంది. కొంతమంది చట్టవిరుద్దంగా హార్స్ రేస్ నిర్వహించడంతో ట్రాపిక్ కు అంతరాయం కలిగింది. వెర్సోవా వంతెనపై పట్టపగలు  గుర్రాలను పరుగులు పెట్టించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.  ఓ పక్క గుర్రాలు పోటీ పడుతుంటే..మరోపక్క వాటిని బైక్ లపై ఫాలో అయ్యే యువత బీరు తాగుతూ..కేరింతలు కొడుతూ. సీసాలను రోడ్డుపైకి విసేరేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.  బైకర్లు హెల్మెట్ ధరించకుండ .. ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. కొంతమంది మహిళలు కూడా మోటార్‌సైకిళ్లపై నిలబడి, ఈవెంట్‌తో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈఘటనలోఓయువకుడు బైక్‌పై నుంచి కిందపడ్డాడు. ఇంత జరుగుతున్నా..పరిస్థితిని అదుపుచేసేందుకు ఆ ప్రాంతంలో అధికారులు ఎవరూ లేరు.

రేసులో పాల్గొన్నవారు విచక్షణారహితంగా గుర్రాలను  కొట్టారని దిండోషి పోలీసులుతెలిపారు. వెర్సోవా బ్రిడ్జిపై ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి కారణమైన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి..రెండు  గుర్రపు బండ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించిన పోలీసులు.. ఈ రేసులో ఏడు గుర్రపు బండ్లు పాల్గొన్నాయన్నారు. అవి అన్నీ ముంబైకి చెందినవేనని MBVV పోలీసులకు చెందిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ దేవిదాస్ హందోర్ తెలిపారు. రైడర్లు మలాడ్ నుండి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే బైకర్లతో వారి కనెక్షన్ ఇంకా తెలియరాలేదు.  ఈ రేస్ లో పాల్గొన్న వారితోపాటు బైక్ లపై వెళ్లిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామమని హండోర్ హామీ ఇచ్చారు

సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు గుర్రాలను వాణిజ్య పరంగా ఉపయోగించడాన్ని నిషేధించాయని జంతు హక్కుల కార్యకర్త విజయ్ మోహనాని అన్నారు. జనాలు తమ ఎంజాయిమెంట్ కోస్ గుర్రాలను  విచక్షణా రహితంగా కొడుతూ రేసింగ్ నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. ముంబయి, థానే ,సముద్ర తీరాల్లో గుర్రాలను క్యారియర్ లుగా వాడుకుంటున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో  ప్రభుత్వ అధికారుల సహకారంతో అక్రమ బెట్టింగ్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయని  విజయ్ మోహనాని ఆవేదన వ్యక్తం చేశారు.