ఐసీసీ డెవలప్‌‌మెంట్ అవార్డ్స్‌‌లో యూఏఈకి మూడు అవార్డులు

ఐసీసీ డెవలప్‌‌మెంట్ అవార్డ్స్‌‌లో యూఏఈకి మూడు అవార్డులు

న్యూ ఢిల్లీ : ఐసీసీ డెవలప్‌‌‌‌మెంట్ అవార్డ్స్‌‌‌‌–2025 గ్లోబల్ విజేతలను ప్రకటించింది. అసోసియేట్ సభ్య దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేసిన బోర్డులు, కార్యక్రమాలకు ఈ అవార్డులు ప్రదానం చేసింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మూడు అవార్డులతో అగ్రస్థానంలో నిలిచింది. గర్ల్స్ అండర్–15 అకాడమీ లీగ్‌‌‌‌కు ‘డెవలప్‌‌‌‌మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్’, ‘ఫిమేల్ క్రికెట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్’, ‘అసోసియేట్ ఉమెన్స్ టీమ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు దక్కాయి.

ఇటలీ క్రికెట్ బోర్డు మెన్స్​ టీమ్​ బెస్ట్​ పెర్మామింగ్​, జపాన్ క్రికెట్ అసోసియేషన్ డిజిటల్ ఫ్యాన్ ఎంగేజ్‌‌‌‌మెంట్, బ్రెజిల్ క్రికెట్ బోర్డు సోషల్ ఇంపాక్ట్, నైజీరియా క్రికెట్ ఫెడరేషన్ క్రికెట్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నాయి. ఐసీసీ చైర్మన్ జై షా విజేతలను అభినందించారు.