ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ వీక్లీ బజార్లో ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 7న అర్ధరాత్రి టాటా మ్యాజిక్ వాహనంలో 7.6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఆర్మూర్‌కు చెందిన పద్మ రంజిత్ కుమార్, వేల్పూర్‌కు చెందిన రేషన్ డీలర్ మేకల పాపన్నపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ కు పంపారని తెలిపారు.
ఎడపల్లి : పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాన్ని సోమవారం ఎడపల్లి పోలీసులు, ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు ఎడపల్లి శివారులో పట్టుకున్నారు. బియ్యంతో పాటు వాహన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమ తెలిపారు.
