కనకమామిడిలోని పేదలకిచ్చిన స్థలాల్లో మైనింగ్

కనకమామిడిలోని పేదలకిచ్చిన స్థలాల్లో మైనింగ్
  •     మట్టి తవ్వకాలు ఆపాలని ఎమ్మార్వోకు బాధితుల వినతి  

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్ మండలం కనకమామిడిలోని పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ గౌతమ్ కుమార్​కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 1998లో గ్రామంలోని సర్వే నం. 51/1లో సుమారు 300 మంది పేదలకు ప్రభుత్వం 110 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించిందని తెలిపారు. 

అయితే, ప్రస్తుతం హైవే పనుల పేరుతో భారీ హిటాచీలు, జేసీబీలతో ఇష్టారీతిన మట్టిని తవ్వుతున్నారని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమ భూములను ధ్వంసం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, తమ స్థలాలనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.