స్కూల్‎లో ఫుడ్ పాయిజనింగ్.. 32 మంది విద్యార్థులకు అస్వస్థత

స్కూల్‎లో ఫుడ్ పాయిజనింగ్.. 32 మంది విద్యార్థులకు అస్వస్థత
  • దిమ్మదుర్తి స్కూల్​ ​హెడ్​మాస్టర్ సస్పెన్షన్​

నిర్మల్ టౌన్, వెలుగు: మిడ్​డే మీల్స్​లో ఫుడ్ పాయిజనింగ్ ​అయ్యి నిర్మల్​ జిల్లాలో 32 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. మామడ మండలంలోని దిమ్మదుర్తి యూపీఎస్​లో రోజూలాగే శుక్రవారం మధ్యాహ్నం 114 మంది స్టూడెంట్స్ మిడ్​డే మీల్స్​ తిన్నారు. భోజనం చేసిన కొద్దిసేపటికి వారిలోని 32 మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. టీచర్లు అందరిని108లో పీహెచ్ సీకి తరలించారు. ఎవరికీ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. ​విషయం తెలుసుకున్న డీఈఓ రవీందర్ రెడ్డి ఘటనపై కలెక్టర్​కు రిపోర్టు పంపారు. నిర్మల్ డీఎంహెచ్ఓ ధన్ రాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీకాంత్ బాధిత స్టూడెంట్స్​కలిసి టెస్టులు చేశారు. కలెక్టర్​ఆదేశాలతో స్కూల్​హెడ్​మాస్టర్ వినోద్ కుమార్​ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ రవీందర్ రెడ్డి ప్రకటించారు. అలాగే మిడ్​డే మీల్స్  ఏజెన్సీని తొలగించినట్లు వెల్లడించారు.