సింగపూర్ పర్యటన ఆలస్యంపై కేజ్రీవాల్ ఆగ్రహం

సింగపూర్ పర్యటన  ఆలస్యంపై కేజ్రీవాల్ ఆగ్రహం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సింగపూర్ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. దీని ఆలస్యం వెనుక రాజకీయ కోణం దాగి ఉందని ఆరోపించారు.యావత్ ప్రపంచం మొత్తం ఢిల్లీ మోడల్ గురించి తెలుసుకోవాలనుకుంటోందన్నారు. ప్రపంచ స్థాయి సదస్సుకు హాజరైతే ఢిల్లీ మోడల్‌ను ప్రపంచం నాయకులకు వివరిస్తాననిచెప్పారు.కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. తాను నేరస్థుడిని కాదని...ప్రజల చేత ఎన్నుకోబడిన ఢిల్లీ ముఖ్యమంత్రినని కేజ్రీవాల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సింగపూర్ ప్రభుత్వం తనను గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించిందన్నారు. దేశ అంతర్గత విభేదాలు ప్రపంచ వేదికపై ప్రతిబింబించకూడదని ఆప్ కన్వీనర్ అన్నారు.ఆదివారం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సింగపూర్ పర్యటనకు సంబంధించి ఆమోదం కోసం అభ్యర్థించారు.