సిటీకి ఎల్లో అలర్ట్

సిటీకి ఎల్లో అలర్ట్

సిటీలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ముసురు వాన పడింది. అధికారులు అందుబాటులో ఉండాలని  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఎమర్జెన్సీ అయితే 040-21111111 హెల్ప్ లైన్ నంబర్​కు కాల్ చేయాలన్నారు. మంగళవారం రాత్రి 11 గంటల వరకు లంగర్​ హౌస్, మియాపూర్​లో 2.0 సెం,మీ, శాస్త్రిపురం, షేక్​పేట, బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్​లో 1.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.  

సిటీలో  బుధవారం భారీ వర్షం పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సిటీకి ఎల్లో అలర్ట్(6.4 నుంచి 11.5 సెం.మీల వాన పడే అవకాశం)ను జారీ చేసింది.  – వెలుగు, హైదరాబాద్