- మొయినాబాద్లో 6.3 డిగ్రీలు నమోదు
- 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతున్నది. హైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాల్లో మరింత తీవ్రమైంది. రాష్ట్రవ్యాప్తంగా నైట్టెంపరేచర్లు 11 డిగ్రీల లోపు నమోదవుతుండగా.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 6.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. అలాగే, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్ సిటీలో చలి తీవ్రత గత 3 రోజుల్లో చాలా పెరిగింది. ఇప్పటిదాకా ఈ సీజన్లో సిటీలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 6.3 డిగ్రీలే కావడం గమనార్హం. హెచ్సీయూ వద్ద 7.5 డిగ్రీలు, ఇబ్రహీంపట్నంలో 7.6, మౌలాలిలో 8.1, రాజేంద్రనగర్‌లో 8.5, బీహెచ్ఈఎల్లో 9.3, శివరాంపల్లిలో 9.3, గచ్చిబౌలిలో 9.7, అల్వాల్ టెలికాం కాలనీలో 10 డిగ్రీల నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి.
మచ్చబొల్లారం, అంబేద్కర్‌నగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 10 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో 9 చోట్ల 11 డిగ్రీలు నమోదయ్యాయి. మరోవైపు, రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 7.1 డిగ్రీల నైట్ టెంపరేచర్ నమోదైంది.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 7.4, మెదక్ జిల్లా దామరంచలో 8.2, సిద్దిపేట జిల్లా తిప్పారంలో 8.3, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 8.5, కామారెడ్డి జిల్లా రామలక్ష్మణపల్లెలో 8.6, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో 9.2, నాగర్‌కర్నూల్‌లో 9.4, నిజామాబాద్జిల్లాలో 9.7, జగిత్యాల జిల్లాలో 9.9 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
