కరోనాను ఎదుర్కోవడంలో భారత్ కృషి భేష్

కరోనాను ఎదుర్కోవడంలో భారత్ కృషి భేష్

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ కృషిని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రశంసించింది. కరోనా వల్ల పడిపోయిన ఎకానమీని తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన యత్నాలను ఈ ఏడాది కూడా కొనసాగించాలని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా సూచించారు. కరోనా పరిస్థితులను, ఎకానమీని డీల్ చేయడంలో భారత్ మంచి పనితీరును కనబర్చిందన్నారు.

‘భారత్ కరెక్ట్ టైమ్‌‌కు అవసరమైన ఆంక్షలను, లాక్‌‌డౌన్‌‌ను విధించింది. అది వర్కౌట్ అయ్యింది. మానిటరీ, ఫిస్కల్ పాలసీల విషయంలో భారత ప్రభుత్వం అవలంభించిన విధానం ప్రశంసనీయం. కొత్త మార్కెట్లకు ఇది పునరుత్తేజం కలిగించే అంశం. చాలా దేశాల్లో నూతన మార్కెట్లు జీడీపీలో ఆరు శాతం వాటా అందిస్తున్నాయి. కానీ ఇండియాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. ఈ విషయంలో భారత్ ఇంకా మెరుగుపడగలదు’ అని క్రిస్టాలినా పేర్కొన్నారు.