రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ , ఆయుష్మాన్ భారత్ పథకాలు అమలు చేయండి

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ , ఆయుష్మాన్ భారత్ పథకాలు అమలు చేయండి

రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..ప్రజల ప్రాణాలను కాపాడాలనే సోయి కేసీఆర్ కు ఉంటు తెలంగాణలో ఆరోగ్యశ్రీ , ఆయుష్మాన్ భారత్ పథకాలను అమలు చేయాలన్నారు.


ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల బకాయిలను వెంటనే చెల్లించి ఆ తర్వాత కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలన్నారు బండి సంజయ్. తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం 440 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను కేటాయించిందని, ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం  కూడా నిధులు ఇచ్చిందని ఆయ‌న అన్నారు. అయినా  వాటిని ఎందుకు ఏర్పాటు చేయ‌లేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రం 1,250 వెంటిలేట‌ర్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వినియోగించ‌ట్లేదని  ప్ర‌శ్నించారు బండి సంజయ్. కేసీఆర్ ఇప్ప‌టివర‌కు ఒక్క ఐసోలేష‌న్ కేంద్రాన్ని కూడా సంద‌ర్శించ‌లేదని  అన్నారు. కేసీఆర్ కు కూడా కరోనా వస్తే ప్రజల ఇబ్బందులు ఏంటో అర్థం అవుతాయి అనుకున్నాం..కానీ ప్రజలు కరోన తో ఇబ్బందులు పడుతుంటే రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ తొట్టి గ్యాంగ్ ను పెట్టి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారన్నారు. 


మరోవై లాక్ డౌన్ పై తీవ్రంగా స్పందించారు బండి సంజయ్. రంజాన్ పండుగ ముగిసిన తర్వాత లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లున్నాడని అని అన్నారు. రంజాన్ పండుగ అయిపొకముందే సీఎం లాక్ డౌన్ ప్రకటన ను  చేసి ఉంటే MIM అసదుద్దీన్ ఓవైసీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చి కేసీఆర్ ను బరిగెలు అందుకొని కొట్టేవాడన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ అంటే కేసీఆర్ గజగజా వణుకుతాడని... కాబట్టే రంజాన్ తర్వాత లాక్ డౌన్ కు ప్లాన్ చేశారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా..ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న సహకరిస్తామన్నారు బండి సంజయ్.