హైదరాబాద్ లో ఆకట్టుకుంటున్న శిల్పాలు

హైదరాబాద్ లో ఆకట్టుకుంటున్న శిల్పాలు

హైదరాబాద్ లోని పలు ప్రధాన రహదారులు, చౌరస్తాలు సరికొత్త అందాలతో ఆకట్టుకుంటున్నాయి. ఫిల్మ్‌నగర్‌ నుంచి దర్గా మార్గంలో ప్రయాణించే వారికి కొత్తందాలు దర్షనమిస్తున్నాయి.. అడుగు వెంట అడుగేస్తూ నడిచేలా వాక్‌ వే చుట్టు గ్రీనరి  మధ్యమధ్యలో సినిమా థీమ్‌తో  శిల్పాలు..చుపరులను ఆకర్షిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సెంట్రల్‌ మీడియన్‌ను యూబీడీ విభాగం అధికారులు 40లక్షల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దారు.షేక్‌పేట కొత్త చెరువు నుంచి ఫిలింనగర్‌ రూట్ లో 12లక్షల వ్యయంతో ఆకర్షణీయమైన మొక్కలను ఏర్పాటు చేసి వాటి మధ్యన వాకింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. సినీ ఇండస్ట్రీకి కేంద్రంగా పేరొందిన ఫిలింనగర్‌ ప్రాంతం విశిష్టతను తెలిపేలా సెంట్రల్‌ మీడియన్‌లో శిల్పాలు ఏర్పాటు చేశారు.  10లక్షల వ్యయంతో నాలుగు భారీ శిల్పాలు ఏర్పాటు చేయడంతో కొత్త అందాలు సంతరించుకుంది. సినిమా షూటింగ్స్‌కు ఉపయోగించే కెమెరా ఆకృతులు, సినిమాల్లోని ఫైటింగ్‌ సీన్‌లు, సన్నివేశాలను తలపించేలా మరికొన్ని శిల్పాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రోడ్డు నుంచి వెళ్లే వాహనదారులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ఫిల్మ్‌నగర్‌ అంటేనే సినీమయం కావడంతో సినీప్రపంచాన్ని తలపించేలా సినీ కెమెరా.. సినిమాలో మాదిరిగా ఇద్దరి నడుమ కత్తియుద్ధం శిల్పాలతోపాటు 'హ్యుమానిటీ' 'యూనిక్‌ లైట్‌ పోల్‌' థీమ్స్‌తో కొలువుదీరిన మరో రెండు శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.