ధైర్యం నూరిపోసిన అశ్విన్.. ధోనీ రికార్డు బద్దలు కొట్టిన ఇమ్రాన్ తాహీర్

ధైర్యం నూరిపోసిన అశ్విన్.. ధోనీ రికార్డు బద్దలు కొట్టిన ఇమ్రాన్ తాహీర్

కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023 పదకొండో సీజన్‌ విశ్వ విజేతగా ఇమ్రాన్ తాహిర్ సారథ్యంలోని అమెజాన్ వారియర్స్ జట్టు నిలిచింది. సోమవారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో వారియర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి.. తొలిసారి టైటిల్ ముద్దాడింది. 

ఈ విజయంతో ఆ జట్టు కెప్టెన్, దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ ఇమ్రాన్ తాహీర్ సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. 44 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా తన పేరును లిఖించుకున్నారు. అంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఈ రికార్డు ఉండగా.. తాహిర్ దానిని అధిగమించారు. 41 ఏళ్ల వయసులో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.

ఈ గెలుపు వెనుక అశ్విన్

ఈ విజయం అనంతరం ఇమ్రాన్ తాహీర్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ గెలుపు వెనుక అశ్విన్ ఉన్నారని చెప్పిన తాహిర్, అతనికి  థ్యాంక్స్‌ చెప్పుకొచ్చాడు. తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఒకప్పుడు రవిచంద్రన్ అశ్విన్‌ చెప్పినా మాటలను తాహిర్ ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. ఈ సీజన్‌ ప్రారంభం కాకముందు కెప్టెన్‌గా రాణిస్తానని అతడే తనలో నమ్మకం కలిగించాడని తాహిర్ వెల్లడించారు.

సీపీఎల్ విజేతలు(2013 నుండి 2023 వరకూ)

  • 2013: జమైకా తల్లావాస్
  • 2014: బార్బడోస్ ట్రైడెంట్స్
  • 2015: ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్ స్టీల్
  • 2016: జమైకా తల్లావాస్
  • 2017: ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
  • 2018: ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
  • 2019: బార్బడోస్ ట్రైడెంట్స్
  • 2020: ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
  • 2021: సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్
  • 2022: జమైకా తల్లావాస్
  • 2023: గయానా అమెజాన్ వారియర్స్