ఓజీ మూవీ నుండి ఇమ్రాన్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివీల్

ఓజీ మూవీ నుండి ఇమ్రాన్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివీల్

ఒకప్పుడు వరుస రొమాంటిక్ సినిమాలతో సీరియల్ కిస్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మీ.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విలన్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు.  ఇటీవల సల్మాన్ ఖాన్ ‘టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3’లో విలన్‌‌‌‌‌‌‌‌గా మెప్పించిన ఇమ్రాన్.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’లోనూ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. మార్చి 24 తన బర్త్‌‌‌‌‌‌‌‌డే సందర్భంగా ఆదివారం ఇమ్రాన్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిచయం  చేశారు మేకర్స్. ఇందులో  ఇమ్రాన్ ఓమీ భాయ్  అనే గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ పాత్రలో క‌‌‌‌‌‌‌‌నిపించ‌‌‌‌‌‌‌‌నున్నట్టు రివీల్ చేశారు. సీరియస్‌‌‌‌‌‌‌‌గా సిగరెట్ వెలిగిస్తూ.. కనిపిస్తున్న తన పోస్టర్ ఆకట్టుకుంటుంది. అలాగే సిగరెట్ స్మోక్‌‌‌‌‌‌‌‌లో నుంచి ఓజీ అని కనిపించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. 

కింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ రొమాన్స్‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌.. ఇందులో  క్రూరమైన విలన్‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది.  ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్‌‌‌‌‌‌‌‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ నటిస్తోంది. అర్జున్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో  నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  సెప్టెంబర్ 27న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా  రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు అడివి శేష్​ హీరోగా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మీ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు.