నిత్యానందను గుర్తుచేసిన మరో బాబా.. కారులో రాసలీలలు.. వీడియో వైరల్..!

నిత్యానందను గుర్తుచేసిన మరో బాబా.. కారులో రాసలీలలు.. వీడియో వైరల్..!

సికార్: రాజస్థాన్లోని సికార్ జిల్లాకు చెందిన ఓ బాబా రాసలీలల వీడియో నెట్టింట వైరల్ అయింది. కారులో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. ఆ యువతి ఒక కాలేజ్ స్టూడెంట్ కావడం గమనార్హం. మత్తు మందు ఇచ్చి తనపై కారులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదు చేయడంతో బాబా బాగోతం వెలుగులోకొచ్చింది.

సికార్లోని లక్ష్మణ్గర్  క్షేత్రపాల్ ఆలయంలో బాబా బాల్క్నాథ్గా సుపరిచితుడైన ఈ ప్రబుద్ధుడు ఆ యువతితో ప్రవర్తించిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉంది. ఆధ్యాత్మిక బోధనలతో సమస్యలను పరిష్కరిస్తానని భక్తులను నమ్మించి తనకు తాను ఒక బాబాగా చెప్పుకుంటూ స్థానికంగా భక్తుల దృష్టిని ఆకర్షించాడు. సదరు యువతి కూడా తనకున్న సమస్యలను అతనితో చెప్పుకుని పరిష్కార మార్గం చూపిస్తాడేమోననే ఆశతో అతనిని కలిసింది. ఆ యువతిలో భక్తురాలిని చూడాల్సిన ఈ దొంగ బాబా బుద్ధి పెడతోవ పట్టింది.

సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ దొంగ బాబాను కలిసి తన బాధలను చెప్పుకునేందుకు ఈ యువతి ఇతను ఉండే ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలో బాబా డ్రైవర్ ఆమెకు ప్రసాదం ఇచ్చాడు. బాబా ఈ ప్రసాదాన్ని మంత్రించి ఇచ్చారని, తింటే మంచి జరుగుతుందని ఆ డ్రైవర్ చెప్పాడు.

Also Read :- నానమ్మని త్రిశూలంతో చంపి శివలింగానికి రక్తాభిషేకం

కొన్ని రోజుల తర్వాత బాబాను కలిసిన ఆమెను ఇంటి దగ్గర స్వయంగా తానే కారులో దిగబెడతానని చెప్పాడు. నమ్మి ఆమె కారు ఎక్కింది. కారు ఎక్కిన ఆమెకు బాబా స్వీట్లు ఇచ్చాడు. స్వీట్లు తిన్న తర్వాత ఆ యువతి ఆలోచనలు ఆమె పరిధిలో లేకుండా పోయాయి. ఇదే అవకాశంగా తీసుకుని ఆ బాబా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాబా డ్రైవర్ కారు నడుపుతుండగా మరో వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను చూపించి యువతిని సదరు బాబా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

బాబా వేధింపులు భరించలేకపోయిన ఆ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాల్క్నాథ్ బాబా తనను రేప్ చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సికార్ జిల్లాలో సంచలనంగా మారింది. ఇన్నాళ్లూ బాబా అని నమ్మిన జనమంతా ఆ వీడియోలో అతని చేష్టలు చూసి నివ్వెరపోయారు.