Zampa's Mankading : రనౌట్ చేసిన బౌలర్.. నాటౌట్ ఇచ్చిన ఎంపైర్

Zampa's Mankading : రనౌట్ చేసిన బౌలర్.. నాటౌట్ ఇచ్చిన ఎంపైర్

క్రికెట్ లో మన్కడింగ్ కి గాడ్ ఫాదర్ ఎవరంటే రవిచంద్రన్ అశ్విన్ అని చెప్తారు. ఎందుకంటే ఆ పద్ధతిని అశ్విన్ వాడినంతగా ఇంకెవరూ వాడలేదు. ఐపీఎల్ లో మాన్కడింగ్ ద్వారా బట్లర్ ని ఔట్ చేసినప్పుడు పెద్ద దుమారమే రేగింది. ఈ పద్ధతిని తీసేయాలని చాలామంది సూచించినా, ఐసీసీ మాత్రం వత్తాసు పలికింది. అయితే, తాజాగా బిగ్ బాస్  లీగ్ లో ఆడమ్ జంపా మాన్కడింగ్ కి పాల్పడి, చివరికి  నవ్వుల పాలయ్యాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ని జంపా రనౌట్ చేశాడు. లెక్క ప్రకారం ఔట్ ఇవ్వాల్సిన ఎంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. ఎందుకంటే..

బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగ్రేడ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో జంపా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న రోజర్స్ ను మాన్కడింగ్ చేసి రనౌట్ చేశాడు. తర్వాత అప్పీల్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ అప్పీల్ ని  ఎంపైర్ నాటౌట్ గా ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా జంపా షాక్ కి గురై ఎంపైర్ ని కారణం అడిగాడు. బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని, చేతిని వంచి బౌలింగ్ చేస్తూ రనౌట్ చేశావని జంపకు వివరించాడు. మన్కడింగ్ చేయాలంటే బౌలింగ్ యాక్షన్ యదావిధిగా ఉండాలని, చేతిని పూర్థి స్థాయిలో తిప్పి, తర్వాత మాన్కడింగ్ చేయాలని సూచించాడు. ఈ విషయం తెలియక జంపా గ్రౌండ్ లో బొక్క బోర్లా పడ్డాడు.