న్యూయార్క్ తో పోల్చుకుంటే మన హైదరాబాద్ బెటర్: సీపీ

న్యూయార్క్ తో పోల్చుకుంటే మన హైదరాబాద్ బెటర్: సీపీ

హైదరాబాద్: ప్రపంచంలో న్యూయార్క్ నగరంతో సమానంగా హైదరాబాద్ నగరం ఉన్నదని నగర పోలీస్ కమిషనర్ అంజనికుమార్ అన్నారు. ఈ ఏడాదిలో న్యూయార్క్ సిటీలో 250 కి పైగా మర్డర్లు జరిగితే మన నగరంలో 85 మర్డర్లు మాత్రమే జరిగాయని ఆయన తెలియజేశారు. ప్రపంచంలో బెస్ట్ నగరాలలో న్యూయార్క్ నగరంతో మన హైదరాబాద్ నగరం పోల్చుకుంటే క్రైమ్ లో 1/4లో మన సిటీ ఉన్నదని అన్నారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నగరంగా తెలంగాణలోని  హైదరాబాద్ నగరం ఉందని కొనియాడారు.

దేశంలో హైదరాబాద్ నగరం నాలుగోవ పెద్ద నగరం అని ఏడు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నగరంలో దాదాపు ఒక కోటి మంది జనాభా నివాసిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే సారి 7 వందల ఇనోవా కార్లతో పాటు 5 వేల ద్విచక్ర వాహనాలు పోలీస్ శాఖకు అందించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సదుపాయాలను ముఖ్యమంత్రి కేసిఆర్…  పోలీస్ శాఖకు కల్పించారని సీపీ అన్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి విధి నిర్వహణలో సక్రమంగా పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

అనంతరం ఈస్ట్ జోన్ పరిధిలోని పెట్రోల్ వాహన నిర్వహణ, పని తీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు అంజనీ కుమార్.. రివార్డులు , ప్రశంస పత్రాలను అందజేశారు.

In comparison to New York, our Hyderabad is Better says Police Commissioner Anjani kumar