
న్యూఢిల్లీ: దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని విదేశీ, వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. బిజినెస్ అంటే పెద్ద కంపెనీలే కాదని.. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ)లు కూడా భాగమని స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈలు ఎదిగేందుకు, తద్వారా దేశీయంగా వ్యాపారం మరింత వృద్ధి చెందేందుకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. దేశీ కంపెనీలకు మద్దతును అందించడం ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు.