పటాన్​చెరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లక్డారంలో ఇంటికో నామినేషన్

పటాన్​చెరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లక్డారంలో ఇంటికో నామినేషన్
  • పటాన్​చెరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా..లక్డారంలో ఇంటికో నామినేషన్
  • క్రషర్ల వల్ల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతోనే.. 
  • డబ్బుల కోసం భిక్షాటన 

పటాన్​చెరు, వెలుగు :  సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలోని లక్డారం గ్రామంలో సిట్టింగ్​ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డికి వ్యతిరేకంగా ఇంటికో నామినేషన్​వేసేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. సోమవారం నామినేషన్​కు అయ్యే ఖర్చుల కోసం సుమారు 20 మంది ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేశారు. లక్డారంలో సుమారు 1500 ఇండ్లున్నాయి. ఇక్కడ సుమారు ఎనిమిది వేల వరకు జనాభా ఉంది.

శివారులోని క్రషర్ల వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. బ్లాస్టింగులు, దుమ్ము, వెహికల్ ​రాకపోకలు ఎక్కువై ప్రమాదాలు జరగడం, రోడ్లు, పొలాలు నాశనం కావడంతో పాటు పెద్ద చెరువు కూడా కలుషితమైపోతోంది. దీంతో సమస్య పరిష్కరించాలని 258 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇంటికొకరు చొప్పున వంద మంది అయినా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఖర్చు కోసం గ్రామంలోనే సోమవారం భిక్షాటన చేశారు.