ఫిట్‌‌గా ఉండాలంటే.. ఇవి ఫాలో అవ్వాలి

V6 Velugu Posted on Sep 07, 2021

‘ఇంట్లో కూర్చుని కూర్చుని పొట్ట పెరిగిపోతోంది’ ఇప్పుడు చాలామంది అంటున్న మాట. ఏడాదిన్నర నుంచి వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్‌‌ వల్ల టైమింగ్స్‌‌ అన్నీ తారుమారయ్యాయి. టైమ్​కు తినకపోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకోవడం, ఎక్కువగా తినడం వల్ల లావయిపోతున్నారు. అలా కాకుండా ఫిట్‌‌గా ఉండాలంటే కొన్ని రూల్స్‌‌ పెట్టుకోవాల్సిందే. వాటిని ఫాలో అవ్వాల్సిందే. మంచి లైఫ్‌‌ లీడ్‌‌ చేయాలంటే.. చక్కటి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే   ఫిట్‌‌గా ఉండాలి. కానీ, ఈ రోజుల్లో చాలామందికి ఫిట్‌‌నెస్‌‌ విషయంలో ప్రాబ్లమ్స్‌‌ వస్తున్నాయి. ఒబెసిటీ బారిన పడుతున్నారు. లావు పెరిగిపోతే గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్‌‌‌‌, ఆయాసం లాంటి జబ్బులు వస్తున్నాయి. ఒబెసిటీ వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. అందుకే ఫిట్‌‌గా ఉండాలి. అలా ఉండాలంటే తిండి, ఎక్సర్‌‌‌‌సైజ్‌‌, నిద్రపై కంట్రోల్‌‌ ఉండాలంటున్నారు. 
సరైన తిండి
వెయిట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌లో హెల్దీ డైట్‌‌ది మెయిన్‌‌ రోల్‌‌. అలా అని ఆకలితో ఉండకూడదు. ప్రతిపూట తింటున్న తిండిపై దృష్టి పెట్టాలి. ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నాం? ఎంత తింటున్నాం? అనేది చూసుకోవాలి. ప్రొటీన్‌‌, ఫైబర్‌‌‌‌ ఎక్కువ  ఉన్న ఫుడ్‌‌ తినాలి. మధ్యలో ఆకలేస్తే కొన్ని బాదంపప్పు తినాలి. బాదంపప్పు తినడం వల్ల అనవసరంగా ఫ్యాటీ ఫుడ్‌‌వైపు మనసు లాగదని యూనివర్సిటీ ఆఫ్‌‌ లీడ్స్‌‌ చేసిన స్టడీలో తెలిసింది. రోజుకు 42 గ్రాముల బాదంపప్పు తినడం వల్ల గుండెసంబంధిత వ్యాధులు రావని ఆ రీసెర్చ్‌‌లో తేలింది. దాంతోపాటుగా పొట్టభాగంలో ఉన్న కొవ్వు, హెచ్‌‌డీఎల్‌‌ కొలెస్ట్రాల్‌‌ కూడా బాదంపప్పు తినడం వల్ల తగ్గిపోతుంది అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. అందుకే, రోజూ తీసుకునే హెల్దీ డైట్‌‌లో బాదంపప్పు ఉండేలా చూసుకోవాలి. దాంతోపాటుగా పండ్లు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకుంటే ఎక్కువగా తినాలనే కోరిక ఉండదు. 
నిద్ర ముఖ్యం
నిద్ర సరిగ్గా లేకపోతే కూడా లావవుతారు. నిద్రసరిపోకపోతే ఇన్సులిన్‌‌ రెసిస్టెన్స్‌‌ పెరిగిపోతుంది. అంతేకాకుండా రెస్టింగ్‌‌ మెటబాలిక్‌‌ రేట్‌‌ కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఆకలి పెరిగి, హార్మోన్స్‌‌ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇది మెంటల్​ హెల్త్‌‌పై కూడా ప్రభావం చూపుతుంది. జంక్‌‌ఫుడ్‌‌ తినాలనే కోరిక పుడుతుంది. అందుకే, ప్రతిరోజు కరెక్ట్‌‌ టైంకి, సరిపడినంత సేపు నిద్రపోవాలి. ఇవన్నీ కరెక్ట్‌‌గా ఫాలో అయితే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా, ఫిట్‌‌గా ఉండొచ్చు.
చెమట చిందించాల్సిందే..
సరైన తిండితో పాటు సరైన వర్కవుట్‌‌ చేస్తే రిజల్ట్‌‌ బాగా కనిపిస్తుంది. వారంలో కనీసం 150 నిమిషాలు ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయాలని చెబుతోంది సెలబ్రిటీ ఫిట్‌‌నెస్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌ యాస్మిన్‌‌ కరాచీవాలా. కార్డియోవాస్కులర్‌‌‌‌, రెసిస్టెన్స్‌‌ ట్రైనింగ్‌‌ రెండూ చేయాలి.“ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌కు, మేజర్‌‌‌‌ మీల్‌‌కు మధ్య గ్యాప్ కనీసం రెండు గంటలుండాలి. ఎక్సర్‌‌‌‌ సైజ్‌‌ చేసే అరగంట ముందు ఒక అరటి పండు, కొన్ని బాదంపప్పు  తింటే ఎక్స్‌‌ట్రా ఎనర్జీ వస్తుంది. బాదంపప్పు ఆకలిని కంట్రోల్‌‌ చేస్తుంది. దాంతో మంచి  వర్కవుట్‌‌ చేయొచ్చు” అని వర్కవుట్‌‌  సూత్రం చెప్పింది యాస్మిన్‌‌.

Tagged health, life style, fitness,

Latest Videos

Subscribe Now

More News