తెలంగాణ ఉద్యమకారుడి హోటల్ పై దాడి..

తెలంగాణ ఉద్యమకారుడి హోటల్ పై దాడి..

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ సెంటర్ లో తెలంగాణ ఉద్యమకారుడైన ఎండీ బాబుమియాకు చెందిన హాటల్ పై దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఫర్మిచర్ ను ధ్వంసం చేశారు. పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులే తన హోటల్ పై దాడి చేశారని బాధితుడు బాబుమియా ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్ పెట్టి.. నాగుర్ల వెంకన్నకు టికెట్ఇవ్వాలని కోరినందుకే ఎమ్మెల్యే అనుచరులు తమ హోటల్ పై దాడి చేశారని చెబుతున్నారు. తనకు ప్రాణభయం ఉందని ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత పోరు రచ్చకెక్కుతోందనే విమర్శలు వస్తున్నాయి.