న్యూఢిల్లీ: సంతోషంగా ఉండాలంటే ఒంట్లో ఆరోగ్యం, జేబులో బాగా డబ్బులుండాలి.. అంతేకదా! సంతోషకరమైన జీవితానికి ఈ రెండూ తప్పనిసరని ఇండియన్ల అభిప్రాయమని ఇప్సోస్ సర్వే ఒకటి తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలలో సర్వే జరిపి హ్యాపినెస్ ఇండెక్స్‌ను ప్రకటించింది. ఇందులో మన దేశం 9వ స్థానంలో నిలిచింది. సంతోషం విషయానికి వస్తే మన ఆలోచనలు వీటి చుట్టే తిరుగుతుంటాయని, పర్సనల్ సేఫ్టీ, సెక్యూరిటీ, దోస్తులు కూడా ముఖ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట.
ఇంకా.. నివసించే వాతావరణం కంఫర్టబుల్‌గా ఉండాలని, జీవితానికో అర్థం ఉండాలని, హాబీలు, ఇష్టాయిష్టాల సంగతీ పట్టించుకోవాల్సిందేనని ఇప్సోస్ ఇండియా ఉన్నతాధికారి పారిజాత చక్రవర్తి చెప్పారు. ఇక ఈ సర్వే లిస్ట్‌లో హ్యాపీయెస్ట్ కంట్రీ స్థానానికి ఆస్ట్రేలియా, కెనడా పోటీ పడుతున్నాయట.. తర్వాత వరుసగా చైనా, గ్రేట్బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, సౌదీ అరేబియా, జర్మనీ, ఇండియా నిలిచాయని ఇప్సోస్ వెల్లడించింది.


