ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మంత్‌‌ రేసులో.. అభి, కుల్దీప్‌, స్మృతి

ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మంత్‌‌ రేసులో.. అభి, కుల్దీప్‌, స్మృతి

దుబాయ్‌‌: ఐసీసీ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మంత్‌‌ (సెప్టెంబర్‌‌) అవార్డు కోసం ముగ్గురు ఇండియా క్రికెటర్లు పోటీపడుతున్నారు. మెన్స్‌‌ కేటగిరీలో స్టార్‌‌ బ్యాటర్‌‌ అభిషేక్‌‌ శర్మ, చైనామన్‌‌ స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌తో పాటు విమెన్స్‌‌ కేటగిరీలో స్టార్‌‌ ప్లేయర్‌‌ స్మృతి మంధాన ఈ అవార్డుకు నామినేట్‌‌ అయ్యారు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌‌లో 7 మ్యాచ్‌‌లు ఆడిన అభిషేక్‌‌ 314 రన్స్‌‌ చేసి ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద టోర్నీగా నిలిచాడు. 200 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో మూడు హాఫ్‌‌ సెంచరీలు చేశాడు. 

ఇక టీ20 చరిత్రలో హయ్యెస్ట్‌‌ రేటింగ్‌‌ పాయింట్లు (931) కూడా సాధించాడు. స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ 6.27 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇండియా మూడుసార్లు పాకిస్తాన్‌‌ను ఓడించడంలో కుల్దీప్‌‌ కీలక పాత్ర పోషించాడు. జింబాబ్వే బ్యాటర్‌‌ బ్రియాన్‌‌ బిన్నెట్‌‌ కూడా ఈ అవార్డుకు నామినేట్‌‌ అయ్యాడు. గత నెలలో 9 టీ20లు ఆడిన బెన్నెట్‌‌ 497 రన్స్‌‌ చేశాడు. 

ఆస్ట్రేలియా విమెన్స్‌‌తో జరిగిన మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌లో ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌గా నిలిచిన మంధాన విమెన్స్‌‌ కేటగిరీలో నామినేట్‌‌ అయ్యింది.  నాలుగు వన్డేల్లో 77 యావరేజ్‌‌, 135.68 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో 308 రన్స్‌‌ చేసింది. మిగిలిన ఇద్దరిలో సిద్రా అమిన్‌‌ (పాకిస్తాన్‌‌), తజ్మిన్‌‌ బ్రిట్స్‌‌ (సౌతాఫ్రికా) ఉన్నారు.