ఎల్లమ్మ చెరువులో మహిళ డెడ్ బాడీ.. గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలింపు

ఎల్లమ్మ చెరువులో మహిళ డెడ్  బాడీ.. గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలింపు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి పోలీసుస్టేషన్​ పరిధిలోని ఎల్లమ్మ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం తేలింది. స్థానికుల సమాచారం ఇవ్వడంతో  పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్​బాడీని గాంధీ హాస్పిటల్​ మార్చురీకి తరలించారు. సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, కాళ్లకు మెట్టెలు, పట్టగొలుసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

నల్ల బ్లౌజ్​, ముదురు నీలం చీర ధరించి ఉందన్నారు. డెడ్​బాడీ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారం క్రితం మృతిచెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యనా, హత్యనా అనేది పోస్టుమార్టం రిపోర్టు తర్వాత తేలుస్తామని పోలీసులు అన్నారు.