పంజాగుట్ట, వెలుగు: పోలీసు కస్టడీలో ఉన్న ఓ దొంగ పరారైన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్టలోని నిమ్స్ ఆవరణలో కొత్తగా నిర్మాణం జరుగుతున్న భవనం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో కాపలాగా ఉన్న వాచ్‌మెన్ పట్టుకున్నాడు.
తెల్లవారుజామున 2.15 ప్రాంతంలో వాచ్‌మెన్ పోలీసులకు ఫోన్ చేసి ఆ వ్యక్తిని అప్పగించాడు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన టిల్లు అని అతడు ఫుట్‌పాత్ పై ఉంటాడన్నారు. ఉదయం 5.50 ప్రాంతంలో యూరిన్‌కు వెళ్తానని చెప్పిన టిల్లు పోలీసుల కళ్లు గప్పి పంజాగుట్ట స్టేషన్ వెనక వైపు నుంచి పరారయ్యాడు.
