ఐటీ రిటర్నులు: గడువు తేదీ పొడిగింపు

ఐటీ రిటర్నులు: గడువు తేదీ పొడిగింపు

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపు దారులు ఐటీ రిటర్నులు దాఖలు చేసే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.  ఈనెలాఖరులోగా దాఖలు చేయాలని గడువు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. 
వాస్తవానికి ఏటా పన్ను చెల్లింపు దారులు జులై 31లోగా దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. కరోనా కారణంగా 2020-2021 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేందుకు గడువును సెప్టెంబర్ 30 వరకు ఇది వరకే పొడిగించారు. అయితే తాజాగా మరోసారి  డిసెంబర్‌ 31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపు దారులు  వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని వస్తున్న ఫిర్యాదులపై స్పందించి  2020-2021 అసెస్‌మెంట్‌ ఏడాదికి ఆడిట్‌ రిపోర్టుల దాఖలుకు గడువును డిసెంబర్‌ నెలాఖరు వరకు పొడిగించినట్లు సీబీడీటీ ప్రకటించింది.