ఉద్యాన పంటల సాగు పెంచండి.. మన రాష్ట్రానికి మహారాష్ట్ర సూచన

ఉద్యాన పంటల సాగు పెంచండి.. మన రాష్ట్రానికి మహారాష్ట్ర సూచన

హైదరాబాద్‌, వెలుగు: హార్టికల్చర్ పంటలతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి పొందొచ్చని, తెలంగాణలో ఆ పంటల సాగును పెంచడంపై దృష్టిసారించాలని మహారాష్ట్ర మంత్రులు సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ మహారాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖల మంత్రులు, అధికారులతో బుధవారం భేటీ అయింది. తెలంగాణలో ఉద్యానవన పంటల సాగును పెంచాల్సిన అవసరం ఉందని అక్కడి మంత్రులు సూచించారు. మహారాష్ట్రలో రూ.4వేల కోట్లతో వ్యవసాయ సంబంధిత పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, షరతుల సాగు విధానం బాగున్నాయన్నారు. మన దగ్గర సాగవుతున్న ఆయిల్ పామ్ పై మహారాష్ట్ర మంత్రులు ఆసక్తి చూపించారు. త్వరలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆయిల్ పామ్ పంటలను సందర్శిస్తామని చెప్పారు. పర్యటనలో భాగంగా మన రాష్ట్ర టీమ్ తాలెగావ్ లో 500 ఎకరాల్లో ఉన్న ఫ్లోరికల్చర్ పార్క్ ను సందర్శించింది.