ఆర్టీసీకి నిధులు పెంచండి

ఆర్టీసీకి నిధులు పెంచండి

 

  •      సీఎం రేవంత్ రెడ్డికి 
  • ర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ లేఖ
     

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావులు కోరారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ నాశనం అయిందని విమర్శించారు. బడ్జెట్ నిధులు, ఆర్టీసీ సమస్యలపై గురువారం సీఎం రేవంత్ రెడ్డికి నేతలు లేఖ రాశారు. మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్టీసీకి డైలీ రెవెన్యూ తగ్గిందని, ప్రతి నెల సబ్సిడీ నిధులు విడుదల చేయాలని సీఎంను నేతలు కోరారు. స్కీం మరింత సక్సెస్ కావాలంటే 3 వేల కొత్త బస్సులు కొనాలని సూచించారు. ఇందుకు రూ. 1500 కోట్ల నిధులు అవసరం అని నేతలు చెప్పారు.