రాష్ట్రంలో పెరిగిన చలి : గిన్నెదారిలో 7.9 డిగ్రీలు

రాష్ట్రంలో పెరిగిన చలి : గిన్నెదారిలో 7.9 డిగ్రీలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాత్రి ఉష్ణో గ్రతలు రోజు రోజుకూ తగ్గుతుండటంతో తీవ్రత పెరుగుతోంది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల నైట్‌ టెంపరేచర్లు తగ్గాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు విపరీతమైన చలి ఉంటోంది. ఉదయం 10 గంటలు దాటినా మంచు కురుస్తుంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కుమ్రంభీం జిల్లాలోని గిన్నెదారిలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఆదిలాబాద్‌‌‌‌లోని సోనాలలో 9.1, కుమ్రంభీం జిల్లాలోని ఆసిఫాబాద్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా లోని బజార్‌ హత్నూర్‌ లో 9.7, సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌ లో 10.1, కుమ్రంభీం జిల్లా లోని రవీంద్రనగర్‌, తిర్యాణిలో 10.2 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో విపరీతమైన చలితో మంటలు కాపుకుంటున్నారు ప్రజలు.  రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం చెప్పింది.