పాకిస్తానీ న‌టుడితో సినిమా.. వాణీ కపూర్పై విరుచుకుప‌డ్డ‌ ట్రోల‌ర్స్‌.. ఆ తర్వాత ఏమైందంటే?

పాకిస్తానీ న‌టుడితో సినిమా.. వాణీ కపూర్పై విరుచుకుప‌డ్డ‌ ట్రోల‌ర్స్‌.. ఆ తర్వాత ఏమైందంటే?

పహల్గామ్లో ఉగ్ర దాడి అనంతరం పాకిస్తానీ నటీనటుల ప్రమేయం ఉన్న ఏ భారతీయ సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. పాకిస్తానీ సటి లేదా పాకిస్తానీ నటుడు ఏదైనా భారతీయ సినిమాలో నటిస్తే దానిపై నిషేధం అమల్లో ఉంది.

ప్రముఖ బాలీవుడ్ నటి వాణీ కపూర్ 'అబీర్ గులాల్' అనే చిత్రంలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ సరసన నటించారు. ఇది పెద్ద దుమారంగా మారింది. "సోషల్ మీడియాల్లో వాణీ నిరంతరం ట్రోలింగ్ని ఎదుర్కొంటోంది.

అయితే ఇప్పటివరకూ దీనిపై వాణీ ప్రత్యక్షంగా స్పందించలేదు. ఇప్పుడు తన వెబ్ సిరీస్ 'మందలా మర్డర్స్' ప్రమోషన్స్లో వాణీ కపూర్ పాత వివాదాన్ని ప్రస్తావించింది. సోషల్ మీడియా ఇటీవల హెక్టిక్గా, తలకు మించన భారంగా మారిందని వాణీ కపూర్ అందోళన చెందారు.

Also Read:- బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో అనుపమ ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్

పాకిస్తాన్ నటుడి సరసన నటించినందున.. నెటిజన్స్ తనను చాలా తీవ్రంగా తిట్టి పోశారని అన్నారు. మంచిగా ఉండండి. దయతో ఉండండి.. ద్వేషాన్ని వెదజల్లకండి. ప్రతికూలతను విడిచిపెట్టండి! ప్రేమ, జాలి దయకు చోటు కల్పించండి!! అని వాణీ సూచించింది. మీరు ఏది ఇస్తే అది వెనక్కి వస్తుంది. తప్పుగా ఏది ఇచ్చినా అది మిమ్మల్ని మరింత దిగజార్చుతుంది! అంటూ కర్మ సిద్ధాంతాన్ని వల్లెవేసింది.  అబీర్ గులాల్ మూవీ ఇండియాలో మే నెలలో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా ప‌డింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)