
గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచటంతో పెరిగిన ధరలు ఇవాళ్టి ( ఆగస్టు 1, 2024 ) నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై ప్రభావం పడింది. 19.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 7.50 పెరగనున్నట్లు ప్రకటించాయి గ్యాస్ కంపెనీలు. పెరిగిన ధరల ప్రభావంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1653.50కు చేరింది. హైదరాబాద్ లో రూ.1896కు చేరింది.
అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఐఒసిఎల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6గంటల నుండి అమల్లోకి వచ్చాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంపు.. వ్యాపార వర్గాలపై ప్రభావం చూపనుంది. అంటే హోటల్స్, టీ షాపులు వంటి చిరు వ్యాపారులపై పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర అదనపు భారం కానుంది.